VZM: ప్రజాస్వామ్యానికి తూట్లు పొడిచేందుకు జమిలి ఎన్నికలు అమలుకు కేంద్రంలో బీజేపీ కుట్ర పన్నుతుందని సీపీఎం జిల్లా కార్యదర్శి తమ్మినేని సూర్యనారాయణ విమర్శించారు. బొబ్బిలి పట్టణంలో ఆదివారం విస్తృతస్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. బీజేపీ నియంతృత్వ పాలన కోసమే ఒకే దేశం, ఒకే ఎన్నిక నినాదాన్ని తెరపైకి తీసుకు వచ్చారన్నారు.