SKLM: ఆమదాలవలస మున్సిపాలిటీ పరిధి కొత్త పార్టీ వారి వీధిలో గల ఏపీటీఎఫ్ జోనల్ కార్యాలయంలో మంగళవారం పెన్షనర్ల సంఘం కార్యవర్గ సమావేశం ఎస్ సిమ్మినాయుడు అధ్యక్షతన జరిగింది. పెన్షనర్లకు మధ్యంతర బృతి 30 శాతం వెంటనే ప్రభుత్వం ప్రకటించాలని సంఘం సభ్యులు డిమాండ్ చేశారు. పెన్షనర్ల సమస్యలను రాష్ట్రప్రభుత్వం పరిష్కరించాలని సంఘం ప్రధాన కార్యదర్శి జనార్దన్ రావు అన్నారు.