KDP: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నిత్యావసర, కూరగాయల ధరలు విపరీతంగా పెరిగాయని, వాటిని తగ్గించేలా చర్యలు తీసుకోవాలని ఆర్డీవో ప్రత్యూషకు మున్సిపల్ ఛైర్మన్ వరప్రసాద్, కౌన్సిలర్లు, వైసీపీ నాయకులు గురువారం ఉదయం వినతిపత్రం సమర్పించారు. వారు నిత్యావసర, కూరగాయల ధరలు విపరీతంగా పెరగడంవల్ల సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు.