VZM: జనసేన పార్టీ లైన్ దాటుతున్న వారిపై క్రమశిక్షణ చర్యలు తప్పవని ఆ పార్టీ బొబ్బిలి నియోజకవర్గ సమన్వయకర్త గిరిడ అప్పలస్వామి హెచ్చరించారు. కార్యకర్తలు, నాయకులతో ఆదివారం సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ పార్టీ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని, స్థానిక ఎమ్మెల్యే తో చర్చించిన తరువాత నిర్ణయం ఉంటుందన్నారు.