VZM : గుర్ల ప్రాంతాల్లో డయేరియా ప్రబలిన నేపథ్యంలో విజయనగరంలో గల గోషాసుపత్రి వైద్య సహాయం పొందుతున్న 11 మంది బాలలను రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ చైర్మన్ కేసలి అప్పారావు ఆదివారం పరామర్శించారు. వారికి అందుతున్న వైద్య సేవలు గురించి ఆరా తీశారు. వైద్య అధికారులు, సిబ్బంది నిరంతరం పర్యవేక్షణ చేస్తూ.. నాణ్యమైన మెరుగైన వైద్య సదుపాయాలు అందించాలన్నారు.