సత్యసాయి: చేనేత సహకార సంఘాలను బలోపేతం చేయాలని చేనేత జౌళి శాఖ మంత్రి సవిత అధికారులను ఆదేశించారు. విజయవాడలోని చేనేత శాఖ కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. చేనేతల అభివృద్ధికి అధికారులు కృషి చేయాలన్నారు. అందుకు చేనేత సహకార సంఘాలను బలోపేతం చేయాలని, నూతన సంఘాలు ఏర్పాటు చేయాలని అన్నారు. అదేవిధంగా ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించాలన్నారు.