VZM: తమన్నా ఫౌండేషన్ ఆధ్వర్యంలో కనపాక నందు గల నవజీవన్ పేద విద్యార్థుల వసతి మరియు వృద్ధులు వసతి గృహంలో భారతరత్న సర్దార్ వల్లభాయ్ పటేల్ 149వ జయంతి ఘనంగా నిర్వహించారు. ముందుగా వారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ అధ్యక్షులు బొడ్డేపల్లి రామకృష్ణారావు, బి.వి.రమణ తదితరులు పాల్గొన్నారు.