NLR: వైసీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్ రెడ్డితో విజయ డెయిరీ ఛైర్మన్ కొండ్రెడ్డి రంగారెడ్డి భేటీ అయ్యారు. నెల్లూరులోని కాకాణి నివాసంలో జరిగిన ఈ సమావేశంలో జిల్లాలోని తాజా రాజకీయ పరిస్థితులు, వైసీపీ బలోపేతానికి చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు. సమావేశంలో ఏఎంసీ మాజీ చైర్మన్లు ఏసునాయుడు, పేర్నేటి కోటేశ్వరరెడ్డి పాల్గొన్నారు.