సత్యసాయి: హైదరాబాద్ లక్ష్మయ్య ఐఏఎస్ అకాడమీ నిర్వహించిన ప్రవేశ పరీక్షలో ధర్మవరం ప్రాంతం నుంచి 28 మంది విద్యార్థులు ఎంపికయ్యారు. వారి వసతి కోసం సంస్కృతి స్వచ్ఛంద సంస్థ తరపున వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ రూ.5 లక్షల విరాళాన్ని లక్ష్మయ్య అకాడమీకి అందజేశారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులు శ్రద్దగా చదివి ధర్మవరం ప్రతిష్ఠను జాతీయ స్థాయిలో చాటాలని కోరారు.