SKLM: సీతంపేట మండలంలోని ద్వారబంధం, రంగంవలస గ్రామాలు అభివృద్ధికి అందనంత దూరంలో ఉన్నాయని గిరిజన సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ఎం.తిరుపతిరావు, సహాయ కార్యదర్శి బి.సాయికుమార్ శనివారం విమర్శలు చేస్తూ మీడియాతో మాట్లాడారు. ఈ గ్రామాలతో పాటు, మండలంలో ఉన్న గిరిజన గ్రామాలకు తక్షణమే మౌలిక సదుపాయాలు కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.