GNTR: ప్రపంచంలో గతంలో అత్యధిక మరణాలు మత విద్వేషాలతో జరిగాయని, మతసామరస్యాన్ని పెంపొందించడం ద్వారానే ప్రపంచంలో శాంతిని పెంపొందించగలమని జన చైతన్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ రెడ్డి తెలిపారు. ఆదివారం గుంటూరు అరండల్ పేటలో ప్రపంచ శాంతి దినోత్సవం కార్యక్రమం జరిగింది. ప్రపంచంలో పలు దేశాలలో హింస జరుగుతున్నప్పటికీ, భారతదేశంలో శాంతి పూరిత వాతావరణం ఉందన్నారు.