VZM: ‘మన ఇల్లు మన గౌరవం’ అనే నినాదంతో శత శాతం ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యే విధంగా కృషి చేయాలని మున్సిపల్ కమిషనర్ నల్లనయ్య సోమవారం ఆదేశించారు. తన ఛాంబర్లో గృహ నిర్మాణాలపై ఆయన సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ నగర పరిధిలో గుంకలాం, కొండకరకాం ప్రాంతాలలో ఇళ్ల స్థలాలను మంజూరు చేయగా… పనులు త్వరితగతిన పూర్తి చేయాలన్నారు.