ప్రకాశం: చీరాల గౌతమి విద్యాసంస్థల యాజమాన్యం వరద బాధితుల సహాయార్థం సీఎం సహాయ నిధికి లక్షా 50 వేల రూపాయలు మరియు అన్న క్యాంటీన్ నిర్వహణకు 10 వేల రూపాయలు చెక్కులను స్థానిక ఎమ్మెల్యే కొండయ్యకు అందజేశారు. వరద బాధితులు కోలుకునే వరకు కూటమి ప్రభుత్వం విశ్రమించబోదని కొండయ్య అన్నారు. వరద బాధితుల కొసం విరాళం ఇచ్చిన గౌతమీ విద్యాసంస్థల వారిని కొండయ్య అభినందించారు.