ఎరుపు రంగు ముల్లంగిలో నీరు, ఫైబర్ అధికంగా ఉంటాయి. ఇవి జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతాయి. మలబద్ధకాన్ని తగ్గిస్తాయి. శరీరంలోని వ్యర్థాలు సులభంగా బయటకు వెళ్లేలా చేస్తాయి. దీంతో జీర్ణవ్యవస్థ శుభ్రంగా ఉంటుంది. పేగుల్లోని టాక్సిన్లు బయటకు వెళ్లిపోతాయి. జీర్ణ సమస్యలు రాకుండా అడ్డుకోవచ్చు. బరువు తగ్గాలనుకునే వారికి ఇవి ఎంతో మేలు చేస్తాయి. తిన్న ఆహారం సులభంగా జీర్ణం అవుతుంది.