CTR: కుప్పం ఎంపీడీఓ కార్యాలయంలో గురువారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా పాలనాధికారి సుమిత్ కుమార్ తెలిపారు. ఈ ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో నియోజకవర్గ ప్రజలు వినతులు అందించి పరిష్కారం పొందవచ్చునన్నారు. కార్యక్రమానికి నియోజకవర్గ, మండల స్థాయి అధికారులు హాజరుకావాలన్నారు.