సత్యసాయి: నంబులపూలకుంట పోలీస్ స్టేషన్ను శనివారం డీఎస్పీ శివ నారాయణస్వామి ఆకస్మికంగా తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్లోనే లాకప్ గదులు, రికార్డులను పరిశీలించారు. పెండింగ్ కేసుల గురించి తెలుసుకున్నారు. మండలంలోని సమస్యాత్మక గ్రామాల గురించి సిబ్బందితో ఆరా తీశారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని సిబ్బందికి సూచించారు.