ప్రకాశం: ఖరీఫ్ సీజన్లో కొరిశపాడు మండల పరిధిలోని గ్రామాల రైతులకు మెరుగైన సేవలందించేందుకు “పొలం పిలుస్తోంది” అనే కార్యక్రమంతో రైతులకు, అవగాహన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని మండల వ్యవసాయ అధికారి పి శ్రీనివాసరావు తెలిపారు. ఈ కార్యక్రమాలు సెప్టెంబర్ 24 నుంచి డిసెంబర్ 31 వరకు షెడ్యూల్ ప్రకారం వారంలో ప్రతి మంగళ, బుధవారాల్లో నిర్వహించటం జరుగుతుందన్నారు.