ప్రకాశం: అద్దంకి, కొరిశపాడు మండలాలకు సంబంధించి పొలం పిలుస్తుంది కార్యక్రమం వాల్ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఆదివారం చిలకలూరిపేటలో అద్దంకి టీడీపీ పార్టీ ఎమ్మెల్యే, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆవిష్కరించారు. రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పొలం పిలుస్తుంది కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టినట్లు మంత్రి పేర్కొన్నారు.