SKLM: ఆమదాలవలస మండలం తోటాడ,అక్కివరం గ్రామాలలో నియోజకవర్గ ఎమ్మెల్యే కూన రవికుమార్ బుధవారం పర్యటిస్తారని ఎమ్మెల్యే కార్యాలయం నుంచి ఒక ప్రకటనలో తెలిపారు.వంద రోజులు పరిపాలన కూటమి ప్రభుత్వం పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయా గ్రామాల్లో నేడు మ. 2 గంటలకు’ ఇది మంచి ప్రభుత్వం’ అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తారన్నారు . స్థానిక నాయకులు, అధికారులు హాజరు కావాలని కోరారు.