NLR: గాంధీ బొమ్మ సెంటర్ వద్ద సనాతన ధర్మాన్ని కాపాడాలని జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ ధర్నా చేశారు. ఆయన మాట్లాడుతూ.. తిరుమలలో వైసీపీ ప్రభుత్వం తప్పు చేసిందని సిట్ ద్వారా నిజాలు బయటకి వస్తాయని పేర్కొన్నారు. హిందూ ధర్మాన్ని కాపాడాలని విజ్ఞప్తి చేశారు. సేవ్ తిరుమల, సేవ్ టీటీడీ, అంటూ నినాదాలు చేశారు.