AKP: తిరుమల లడ్డు విషయమై ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేస్తున్న ప్రాయశ్చిత్త దీక్షకు మద్దతుగా సోమవారం నర్సీపట్నం వెంకటేశ్వరస్వామి ఆలయంలో జనసేన నాయకులు దీక్షా కార్యక్రమం చేపట్టారు. పార్టీ నియోజకవర్గ ఇంఛార్జ్ సూర్యచంద్ర మాట్లాడుతూ.. తిరుమల ఘటనలో దోషులను కఠినంగా శిక్షించాలన్నారు. గత ప్రభుత్వ హయాంలో టీటీడీలో జరిగిన అవకతవకలు, అక్రమాలపై విచారణ జరపాలన్నారు.