CTR: నగరి ప్రభుత్వ ఆసుపత్రిలో సోమవారం పారిశుద్ధ్య కార్మికులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ శిబిరాన్ని సందర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. స్వచ్ఛతా హి సేవా కార్యక్రమంలో భాగంగా ఈ సేవా కార్యక్రమాన్ని చేపట్టినట్లు పేర్కొన్నారు. ఆయనతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.