కృష్ణా: కేసుల్లో క్వాలిటీ ఇన్వెస్టిగేషన్లో పురోగతి సాధించి, బాధితులకు సత్వర న్యాయమందించే దిశగా ప్రణాళికల రూపొందించాలని ఎస్పీ ఆర్ గంగాధర్ రావు తెలిపారు. మచిలీపట్నం జిల్లా పోలీస్ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా వ్యాప్తంగా ఉన్న పోలీస్ అధికారులతో ఎస్పీ బుధవారం నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ మేరకు పలు అంశాలపై దిశా నిర్దేశం చేశారు.