కోనసీమ: ముమ్మిడివరం ఆపిల్ స్కూల్ నందు ఆరవ తరగతి చదువుతున్న విద్యార్థిని వాసంశెట్టి హారిక సౌమ్య కూచిపూడి నృత్య పోటిలలో ప్రథమ బహుమతి సాధించింది. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఏపీ పర్యావరణం, టూరిజం మంత్రిత్వశాఖ కూచిపూడి నృత్య పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో ప్రథమ బహుమతి సాధించిన సౌమ్యను పాఠశాల కరెస్పాండంట్ పుండరీష్, హెచ్.ఎం, డాన్స్ టీచర్ అభినందించారు.