NLR: చేజర్ల మండల కేంద్రంలోని చేజర్ల బస్టాండ్ వద్ద సంగం సీఐ వేమారెడ్డి సైబర్ నేరాలు అసాంఘిక కార్యక్రమాలపై ప్రజలకు అవగాహన కలిగించారు. బుధవారం సాయంత్రం బస్టాండ్ వద్ద స్థానిక ప్రజలు పలు వాహనదారులతో సభ నిర్వహించారు. సీఐ మాట్లాడుతూ.. ప్రజలు తమ ప్రాంతంలో అపరిచితుల కదిలికపై, సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలని, అనుమానం కలిగిన వెంటనే తమకు సమాచారమివ్వాలన్నారు.