ELR: చాట్రాయి మండలం చనుబొంద గ్రామంలో అక్రమ బాణసంచా తయారీ కేంద్రంపై ఆదివారం పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో భాగంగా ఓ దుకాణంలో రూ.30 వేలు ఖరీదు చేసే బాణసంచాను అక్రమంగా నిల్వ చేసినట్లు గుర్తించారు. ఈ ఘటనపై పోలీసుల కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అలాగే అక్రమంగా బాణసంచా తయారు చేసినా విక్రయించిన చర్యలు తప్పవన్నారు.