SKLM: కొండ మీద ఇళ్లు ఉన్నప్పుడు కొండ కింద తవ్వితే ఆ ఇళ్లకు ప్రమాదం వాటిల్లుతుందని ఎవరికైనా తెలుస్తుంది. ఎస్ఎం పురం ఆనమిత్ర కాలనీలో మాత్రం అక్రమార్కులకు కనికరం లేకపోయింది. అనుమతులు తీసుకోకుండా, అడ్డూ అదుపు లేకుండా ఇష్టానుసారం గ్రావెల్ తరలించుకుపోతున్నారు. ఎస్‌ఎంపురంలోని ఆనమిత్ర టౌన్ షిప్ రాజీవ్ స్వగృహ కాలనీకి ఆనుకుని గ్రావెల్‌ను తరలిస్తున్నారు.