Manchu Laxmi : వైరల్ వీడియో.. బాబోయ్ మంచు లక్ష్మీ గ్లామర్ షో!
ప్రస్తుతం దసరా మూవీలోని 'చమ్కీల అంగిలేసి' సాంగ్ సోషల్ మీడియాను ఓ ఊపు ఊపేస్తోంది. రీల్స్, కవర్ సాంగ్స్ చేస్తూ దసరా పండగ చేసుకుంటున్నారు నెటిజన్స్. సెలబ్రిటీస్ కూడా ఈ పాటకు స్టెప్పులేస్తున్నారు. పిల్లల నుంచి పెద్దల దాకా అందరూ ఈ పాటను ఎంజాయ్ చేస్తున్నారు. తాజాగా మంచు లక్ష్మీ కూడా ఈ పాటకు చిందేసింది. అయితే ఎన్నడు లేని విధంగా ఈ మధ్య మంచు లక్ష్మీ గ్లామర్ డోస్ పెంచేసింది.
ప్రస్తుతం దసరా మూవీలోని ‘చమ్కీల అంగిలేసి’ సాంగ్ సోషల్ మీడియాను ఓ ఊపు ఊపేస్తోంది. రీల్స్, కవర్ సాంగ్స్ చేస్తూ దసరా పండగ చేసుకుంటున్నారు నెటిజన్స్. సెలబ్రిటీస్ కూడా ఈ పాటకు స్టెప్పులేస్తున్నారు. పిల్లల నుంచి పెద్దల దాకా అందరూ ఈ పాటను ఎంజాయ్ చేస్తున్నారు. తాజాగా మంచు లక్ష్మీ కూడా ఈ పాటకు చిందేసింది. అయితే ఎన్నడు లేని విధంగా ఈ మధ్య మంచు లక్ష్మీ గ్లామర్ డోస్ పెంచేసింది. సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటోలను షేర్ చేస్తోంది. ఇక ఇప్పుడు దసరా సినిమా రిలీజ్ సదర్భంగా.. నానికి బెస్ట్ విషెస్ తెలుపుతూ.. చమ్కీల అంగిలేసి పాటకు తన కూతురు విద్వా నిర్వాణతో కలసి డ్యాన్స్ చేసింది. పింక్ కలర్ శారీలో కుర్ర హీరోయిన్లకు ధీటుగా స్టెప్పులేసింది. ముఖ్యంగా ఆమె నాభి అందాలు బయటపడేలా షో చేసింది. సినిమాల్లోని పాటల్లో హీరోయిన్ల నాభికి ఉన్నట్టు.. రింగ్ కూడా ఉంది. ఇదే ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. లక్ష్మక్క కూడా గ్లామర్ షో మొదలెట్టేసిందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. కొందరైతే.. మమ్మల్ని బ్రతకనివ్వండి.. విలన్ రోల్స్ చేయొచ్చుగా.. చాలా చండాలంగా ఉందని.. ఇలా రకారకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. అయితే అసలే ట్రోలర్స్ రాయుళ్లు మంచు ఫ్యామిలీని ఓ రేంజ్లో ట్రోల్ చేస్తుంటారు. అలాంటిది లక్ష్మక్క కూడా గ్లామర్ షో మొదలు పెడితే ఊరుకుంటారా.. అందుకే ఇప్పుడు ఆమెను ఆడెసుకుంటున్నారు. ఇకపోతే అప్పుడెప్పుడో అనగనగా ఓ ధీరుడు సినిమాలో విలన్‌గా నటించిన లక్ష్మీ.. ప్రస్తుతం అగ్ని నక్షత్రం అనే సినిమాలో నటిస్తోంది.