పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) నటించిన బ్లాక్ బస్టర్ మూవీ 'బద్రి'లో హీరోయిన్గా నటించిన అమిషా పటేల్(Ameesha Patel)కు అరెస్ట్ వారెంట్ జారీ అయ్యింది. ఈ బాలీవుడ్(Bollywood) హీరోయిన్ తెలుగులో 'బద్రి' సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. టాలీవుడ్(Tollywood)లో పవన్‌తో 'బద్రి' సినిమా తర్వాత మహేష్ బాబుతో 'నాని', ఎన్టీఆర్ తో 'నరసింహుడు', బాలయ్యతో 'పరమవీరచక్ర' వంటి సినిమాల్లో నటించింది. ప్రస్తుతం తెలుగులో నటించడం లేదు. బాలీవుడ్(Bollywood)కే ఈ ముద్దుగుమ్మ పరిమితం అయ్యింది.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) నటించిన బ్లాక్ బస్టర్ మూవీ ‘బద్రి’లో హీరోయిన్గా నటించిన అమిషా పటేల్(Ameesha Patel)కు అరెస్ట్ వారెంట్ జారీ అయ్యింది. ఈ బాలీవుడ్(Bollywood) హీరోయిన్ తెలుగులో ‘బద్రి’ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. టాలీవుడ్(Tollywood)లో పవన్‌తో ‘బద్రి’ సినిమా తర్వాత మహేష్ బాబుతో ‘నాని’, ఎన్టీఆర్ తో ‘నరసింహుడు’, బాలయ్యతో ‘పరమవీరచక్ర’ వంటి సినిమాల్లో నటించింది. ప్రస్తుతం తెలుగులో నటించడం లేదు. బాలీవుడ్(Bollywood)కే ఈ ముద్దుగుమ్మ పరిమితం అయ్యింది.
తాజాగా అమిషా పటేల్(Ameesha Patel)పై ఓ చెక్ బౌన్స్ కేసు విషయంలో అరెస్ట్ వారెంట్ జారీ అయ్యింది. రాంచీకి చెందిన అజయ్ కుమార్ సింగ్ అనే వ్యక్తి సినిమా చేయాలనుకున్నాడు. సినిమాల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఆయన అమిషా పటేల్ ను కలిశాడు. ఈ తరుణంలో ‘దేశీ మ్యాజిక్’ అనే మూవీని రూపొందించేందుకు అజయ్ కుమార్ నుంచి అమిషా పటేల్ రూ.2.5 కోట్లను తీసుకుంది.
ఇద్దరూ సినిమాకు సంబంధించి ఒప్పందం కుదుర్చుకున్నారు. 2013లో ఆ ప్రాజెక్ట్ పట్టాలెక్కింది. అయితే ఏళ్లు గడుస్తున్నా కూడా సినిమా మాత్రం పూర్తి కాలేదు. దీంతో తన డబ్బును వెనక్కి తిరిగివ్వాలని అజయ్ కుమార్ అమిషా పటేల్(Ameesha Patel)ను కోరాడు. ఈ నేపథ్యంలో అమిషా అజయ్ కు రూ.2.5 కోట్ల చెక్ ఒకటి, రూ.50 లక్షల చెక్ మరోకటి ఇచ్చింది. అయితే చెక్ లు బౌన్స్ అవ్వడంతో అజయ్ కోర్టులో కేసు వేశాడు.
అమిషా పటేల్(Ameesha Patel) ఆమె బిజినెస్ పార్ట్నర్ అయిన క్రునాల్పై రాంచీ సివిల్ కోర్టులో కేసు నమోదైంది. తాజాగా ఈ కేసుపై విచారణ జరిగింది. దీంతో అమిషా పటేల్ పై కోర్టు అరెస్ట్ వారెంట్ ను జారీ చేసింది. 420, 120 సెక్షన్ల కింద అమిషా పటేల్(Ameesha Patel)ను అరెస్ట్ చేశారు. ఈ కేసు తదుపరి విచారణ ఏప్రిల్ 15న జరగనుంది. గతంలో కూడా అమిషా పటేల్ పై పలు కేసులు నమోదైన సంగతి తెలిసిందే.