క్రికెటర్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ నటి అనుష్క శర్మ దంపతులు ఆధ్యాత్మిక బ్రేక్ తీసుకున్నారు. రిషికేష్‌లో స్వామి దయానందగిరి ఆశ్రమంలో స్వామీజీని కలిశారు. ఆయన ఆశీస్సులు తీసుకున్నారు. వీరు ఈ ఆధ్యాత్మిక ట్రిప్‌కు తమ కూతురు వామికను కూడా వెంట బెట్టుకొని వెళ్తుంటారు. ఈసారి మాత్రం పాప కనిపించలేదు. మంగళవారం ఉదయం ఈ జంట ఆశ్రమంలో స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు. స్వామి దయానందగిరి జీ మహారాజ్ ప్రధాని నరేంద్ర మోడీకి కూడా స్పిరిచ్యువల్ గురువు. అనుష్క గ్రాగరీ అనార్కలీ సూట్ ధరించగా, కోహ్లీ బ్లాక్ ప్యాంట్, వైట్ ఫ్లప్పీ స్వెట్టర్ ధరించాడు. వీరు ఆశ్రమంలోని ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొన్నారు. వీరు ఆధ్యాత్మిక విందు లేదా భండారా కూడా నిర్వహించారు. 100 మంది వరకు సాధువులకు ఇచ్చి, వారి ఆశీర్వచనాలు అందుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను ఓ ఫ్యాన్ క్లబ్ షేర్ చేసింది. గతంలో వీరు బృందావన్‌ను దర్శించుకున్నారు. ఇక్కడకు కూతురును తీసుకు వచ్చారు.