పొడుగు కాళ్ల సుందరి పూజాహెగ్డే తన సోదరుడు రిషబ్ హెగ్డే వివాహం సందర్భంగా భావోద్వేగానికి లోనైంది. అతడు పెళ్లి చేసుకోవడంపై చాలా సంతోషంగా ఉన్నానని తెలిపింది. గతంలో ఎప్పుడూ లేనంత ఆనందంగా ఉన్నట్లు పేర్కొంది. చిన్న పిల్లలా నవ్వేశా.. ఆనందంతో ఏడ్చేశానని అభిమానులతో పంచుకుంది. పూజా సోదరుడు రిషబ్ హెగ్డే, శివానీ శెట్టి ప్రేమ వివాహం చేసుకున్నారు. అంగరంగ వైభవంగా ఈ వేడుక జరిగింది. ఈ వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా పూజా నిలిచింది. కనకాంబరం రంగు చీరలో బుట్టబొమ్మ మెరిసిపోయింది. కుటుంబసభ్యులతో కలిసి పూజా హెగ్డే ఈ వేడుకలో సందడి చేసింది. ఈ సందర్భంగా తండ్రితో కలిసి సరదాగా ఫొటోలకు ఫోజిచ్చింది. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పంచుకుంది.
‘నా సోదరుడు ప్రేమ పెళ్లి చేసుకున్నాడు. ఈ వేడుక ప్రారంభం నుంచి ఎప్పుడూ లేనంత ఆనందంగా ఉన్నా. చిన్నపిల్లనై పోయా. నవ్వుతూ ఏడ్చేశారు. అన్న నీ జీవితంలో మరో అడుగు వేశావు. ఇక జీవితాంతం ప్రేమలోకంలో మునిగిపోతావని ఆశిస్తున్నా. ఒకరినొకరు అర్థం చేసుకుని ప్రశాంతంగా జీవితం పొందండి. అందమైన వదిన శివానీ మా కుటుంబంలోకి స్వాగతం’ అంటూ పూజా తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేసింది.