Prabhas కు మళ్లీ హెల్త్ ప్రాబ్లమ్స్.. బ్రేక్ తప్పదా!?
Prabhas : పాన్ ఇండయా స్టార్ ప్రభాస్‌కి మళ్లీ ఏమైందని.. ఆందోళన పడుతున్నారు అభిమానులు. ఎప్పటికప్పుడు ప్రభాస్ హెల్త్ పై సోషల్ మీడియాలో ఏదో ఒక పుకారు వినిపిస్తునే ఉంది. రాధే శ్యామ్ రిలీజ్ అయిన వెంటనే.. సలార్ సెట్స్‌లో ప్రమాదానికి గురయ్యారని.. మోకాలి సర్జరీ కోసం విదేశాలకు వెళ్లాడని వినిపించింది.
పాన్ ఇండయా స్టార్ ప్రభాస్‌కి మళ్లీ ఏమైందని.. ఆందోళన పడుతున్నారు అభిమానులు. ఎప్పటికప్పుడు ప్రభాస్ హెల్త్ పై సోషల్ మీడియాలో ఏదో ఒక పుకారు వినిపిస్తునే ఉంది. రాధే శ్యామ్ రిలీజ్ అయిన వెంటనే.. సలార్ సెట్స్‌లో ప్రమాదానికి గురయ్యారని.. మోకాలి సర్జరీ కోసం విదేశాలకు వెళ్లాడని వినిపించింది. ఇక ఇటీవల ప్రభాస్ జ్వరంతో బాధపడుతున్నాడనే వార్తలు వైరల్ అయ్యాయి. కానీ ప్రభాస్ స్టైలిష్ లుక్‌లో కనిపించి వాటికి చెక్ పెట్టేశాడు. అయితే ఇప్పుడు మళ్లీ ప్రభాస్‌కి అస్వస్థత అనే టాక్ నడుస్తోంది. ప్రస్తుతం ప్రభాస్ సలార్, ప్రాజెక్ట్ కె, మారుతి సినిమాల షూటింగ్లో గ్యాప్ లేకుండా పాల్గోంటున్నాడు. అందుకే మరోసారి ప్రభాస్ అనారోగ్యం పాలయ్యాడని ప్రచారం జరుగుతోంది. అంతేకాదు చికిత్స కోసం విదేశాలకు వెళ్లే అవకాశం ఉందంటున్నారు. కొన్ని రోజులు షూటింగ్స్‌కి బ్రేక్ ఇవ్వబోతున్నాడని.. ఇప్పటికే అప్ కమింగ్ షూటింగ్ షెడ్యూల్స్ పోస్ట్‌పోన్ అయినట్టు రూమర్స్ వినిపిస్తున్నాయి. అయితే ఇప్పటి వరకు ప్రభాస్ టీం నుంచి దీనిపై ఎలాంటి అప్డేట్ లేదు. కానీ ఇలాంటి వార్తలు విని ప్రభాస్ ఫ్యాన్స్ కాస్త టెన్షన్ పడుతున్నారు. దీనిపై ప్రభాస్ టీం క్లారిటీ ఇవ్వాలని అంటున్నారు. ఇక సలార్, ప్రాజెక్ట్ కె షూటింగ్ విషయానికొస్తే.. చిత్రీకరణ చివరి దశకు చేరుకున్నట్టు తెలుస్తోంది. ఆదిపురుష్ గ్రాఫిక్స్ వర్క్ కూడా కంప్లీట్ అయినట్టు టాక్. మారుతి ప్రాజెక్ట్ రెండు, మూడు షెడ్యూల్స్ కంప్లీట్ అయిందంటున్నారు. జూన్ 16న ఆదిపురుష్ రిలీజ్ చేయబోతున్నారు. సెప్టెంబర్ 28న సలార్.. 2024 జనవరి 12న ‘ప్రాజెక్ట్ కె’ థియేటర్లోకి రాబోతున్నాయి. ఆ తర్వాత మారుతి సినిమా రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు.