Business : నిజమేనా.. విజయ్, సూర్యను మించి ‘పుష్ప2’..!?
Business : సినిమా సెట్స్ పైకి వెళ్లక ముందే.. బిజినెస్ లెక్కలు స్టార్ట్ అయిపోతున్నాయి. ఇప్పటికే.. తమిళ్లో రెండు సినిమాలకు ఊహించని విధంగా బిజినెస్ డీల్ జరిగినట్టు తెలుస్తోంది. టాలెండెట్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ తెరకెక్కిస్తున్న విజయ్ 'లియో' మూవీకి ఏకంగా 400 కోట్ల భారీ ఆఫర్ వచ్చినట్టు ప్రచారం జరుగుతోంది.
సినిమా సెట్స్ పైకి వెళ్లక ముందే.. బిజినెస్ లెక్కలు స్టార్ట్ అయిపోతున్నాయి. ఇప్పటికే.. తమిళ్లో రెండు సినిమాలకు ఊహించని విధంగా బిజినెస్ డీల్ జరిగినట్టు తెలుస్తోంది. టాలెండెట్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ తెరకెక్కిస్తున్న విజయ్ ‘లియో’ మూవీకి ఏకంగా 400 కోట్ల భారీ ఆఫర్ వచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. ఇక ఇప్పుడు ‘లియో’ని మించి మరో సినిమా కి సెన్సేషనల్ బిజినెస్ జరిగినట్టుగా తమిళ వర్గాల టాక్. శివ దర్శకత్వంలో సూర్య హీరోగా 42వ సినిమా.. భారీ పీరియాడికల్ డ్రామాగా తెరకెక్కుతోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ స్జేజ్లో ఉంది. కానీ అప్పుడే 500 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకుంటున్నట్టుగా కోలీవుడ్ సినీ వర్గాలు చెబుతున్నాయి. ఇదిలా ఉండగానే.. మన పుష్పరాజ్ డిమాండ్ నెక్స్ట్ లెవల్లో ఉందని అంటున్నారు. అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పుష్ప సీక్వెల్ పై భారీ అంచనాలున్నాయి. ముఖ్యంగా హిందీ ఆడియన్స్ పుష్ప2 కోసం ఈగర్లీ వెయిటింగ్ అంటున్నారు. అందుకే.. థియేట్రికల్ బిజినెస్ గురించి ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. పుష్ప2 థియేట్రికల్ రైట్స్ కోసం ఏకంగా వెయ్యి కోట్లు డిమాండ్ చేస్తున్నారనే రూమర్ వినిపిస్తోంది. ఈ సినిమా కోసం దాదాపుగా 400 కోట్లు ఖర్చు చేస్తున్నారు మైత్రీ మూవీ మేకర్స్. దాంతో థియేట్రికల్, నాన్ థియేట్రికల్.. అన్నిరైట్స్ కలుపుకొని వెయ్యి కోట్ల బిజినెస్ జరిగినా ఆశ్చర్యపోనక్కర్లేదనేది బన్నీ ఫ్యాన్స్ మాట. కానీ ఇది కాస్త ఎక్కువేనని యాంటీ ఫ్యాన్స్ వాదన. ఏదేమైనా ఈ బిజినెస్ లెక్కలు మాత్రం.. సినిమా పై భారీ హైప్ క్రియేట్ చేస్తున్నాయి.