చాలాకాలంగా సరైన సక్సెస్ లేక సతమతమవుతున్నాడు షారుఖ్ ఖాన్. అందుకే నాలుగేళ్ల తర్వాత భారీ యాక్షన్ థ్రిల్లర్‌తో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. జనవరి 25న ప్రపంచవ్యాప్తంగా.. 7700 స్క్రీన్స్‌లో భారీ ఎత్తున ‘పఠాన్’ రిలీజ్ అయింది. ఈ సినిమా బాలీవుడ్‌కి బిగ్ రిలీఫ్ ఇస్తుందని ఆశగా ఎదురు చూస్తున్నారు. బుకింగ్స్ కూడా అదే రేంజ్లో జరిగాయి. బాహుబలి 2 తర్వాత సెకండ్ ప్లేస్‌లో నిలిచింది పఠాన్. బాహుబలి 2 హిందీ వెర్షిన్కి 6.50 లక్షల టిక్కెట్స్ బుక్ అవ్వగా.. పఠాన్‌కు 5.56 లక్షల టిక్కెట్స్ బుక్ అయ్యాయి. ఈ లెక్కన పఠాన్ క్రేజ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అందుకు తగ్గట్టే ఈ సినిమాకు పాజిటివ్ రివ్యూలు వస్తున్నాయి. యాక్షన్ పరంగా పఠాన్ అదిరిపోయిందంటున్నారు. షారుఖ్ సాలిడ్ కంబ్యాక్ ఇచ్చినట్టే అంటున్నారు.
డైరెక్టర్ సిద్ధార్త్ ఆనంద్ మేకింగ్ అదిరిపోయిందంటున్నారు. అసలు ట్రైలర్లో సాంపిల్ మాత్రమే చూపించారు.. సినిమా నెక్స్ట్ లెవల్లో ఉందంటున్నారు. ముఖ్యంగా సల్మాన్ ఖాన్ ఎపిసోడ్ అదరహో అనేలా ఉందట. పఠాన్‌లో సల్మాన్ ఖాన్ దాదాపు 20 నిమిషాలు పాటు ఉంటాడని అంటున్నారు. దాంతో ట్విట్టర్లో పఠాన్ బ్లాక్ బస్టర్ అంటూ ట్రెండ్ చేస్తున్నారు. రేటింగ్స్ కూడా అలాగే ఉన్నాయి. మొత్తంగా సిద్దార్థ్ ఆనంద్ సాలిడ్ హిట్ కొట్టేసినట్టే. ఇక ఈ సినిమా తర్వాత సిద్దార్త్ హృతిక్ రోషన్‌తో ఫైటర్ అనే సినిమా చేస్తున్నాడు. ఆ తర్వాత ప్రభాస్‌తో భారీ ప్రాజెక్ట్ చేయనున్నాడు. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించబోతున్నారు. ఇందులో బాలీవుడ్ కండల వీరుడు హృతిక్ రోషన్ కూడా నటిస్తున్నట్టు టాక్. దాంతో ప్రభాస్ ప్రాజెక్ట్ పై అంచనాలు పెరిగిపోతున్నాయి.