Kushi : లైగర్ సినిమాతో పాన్ ఇండియాను షేక్ చేసేస్తామని.. జోరుగా ప్రమోషన్స్ చేశారు హీరో విజయ్ దేవరకొండ, డైరెక్టర్ పూరి జగన్నాథ్. కానీ ఇద్దరికీ సీన్ రివర్స్ అయిపోయింది. కనీసం రౌడీ అయినా సోషల్ మీడియాలో కనిపిస్తున్నాడు కానీ.. పూరి ఏం చేస్తున్నాడో ఎవరికీ తెలియదు.
లైగర్ సినిమాతో పాన్ ఇండియాను షేక్ చేసేస్తామని.. జోరుగా ప్రమోషన్స్ చేశారు హీరో విజయ్ దేవరకొండ, డైరెక్టర్ పూరి జగన్నాథ్. కానీ ఇద్దరికీ సీన్ రివర్స్ అయిపోయింది. కనీసం రౌడీ అయినా సోషల్ మీడియాలో కనిపిస్తున్నాడు కానీ.. పూరి ఏం చేస్తున్నాడో ఎవరికీ తెలియదు. అయితే లైగర్ దెబ్బ నుంచి కోలుకోవడానికి.. వెంటనే కొత్త సినిమాను ఆడియెన్స్ ముందుకు తీసుకురావాలనుకున్నాడు విజయ్ దేవరకొండ. కానీ రౌడీ ఆశలను ఆవిరి చేసేసింది స్టార్ బ్యూటీ సమంత. లేదంటే ఈ పాటికే ఖుషి మూవీ థియేటర్లోకి వచ్చి ఉండేది. ప్రస్తుతం విజయ్ దేవరకొండ ఆశలన్నీ ‘ఖుషి’ మూవీ పైనే ఉన్నాయి. దర్శకుడు శివ నిర్వాణ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే కొంత భాగం షూటింగ్ జరుపుకుంది. అయితే ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లినప్పుడు.. లాస్ట్ ఇయర్ క్రిస్మస్ కానుకగా రిలీజ్ అవుతుందని ప్రకటించారు. కానీ సమంత మయోసైటిస్ అనే వ్యాధి బారిన పడడంతో.. అనుకోకుండా బ్రేక్ పడింది. అయితే ఇప్పుడు సామ్ కోలుకుంది.. కానీ ఇంకా ఖుషి షూటింగ్ రీ స్టార్ట్ కాలేదు. ప్రస్తుతం సమంత బాలీవుడ్ వెబ్ సిరీస్ ‘సిటాడెల్’ షూటింగ్‌తో బిజీగా ఉంది. అయితే అతి త్వరలోనే సామ్ ‘ఖుషి’ షూటింగ్లో జాయిన్ అవనుందని తెలుస్తోంది. ఇండస్ట్రీ వర్గాల ప్రకారం.. ఈ నెల 8 నుంచి ‘ఖుషి’ షూటింగ్ స్టార్ట్ అవనుందని తెలుస్తోంది. ఇక ఈ సినిమాను వీలైనంత త్వరగా కంప్లీట్ చేసేలా ప్లాన్ చేస్తున్నారట. అన్ని అనుకున్నట్టు జరిగితే జూన్ నెలలో ఖుషి మూవీ రిలీజ్ కానుందని అంటున్నారు. త్వరలోనే రిలీజ్ డేట్ పై అఫిషీయల్ అనౌన్స్మెంట్ రాబోతోంది. మరి ఈసారైనా ఖుషి కరెక్ట్ టైంకి కంప్లీట్ అవుతుందేమో చూడాలి.