»Kartik Aaryan Gets Trolled For His Dressing Sense At Sonnalli Seygalls Wedding Netizens Call Him Alien
Kartik Aaryan: ఏలియన్ లా ఉన్నావ్.. కార్తీక్ ఆర్యన్ పై ట్రోల్స్..!
బాలీవుడ్ మోస్ట్ హ్యాండ్సమ్ హీరోల్లో కార్తీక్ ఆర్యన్ కూడా ఒకరు. సినిమాల్లోనే కాదు, బయట కూడా చాలా స్టైలిష్ గా ఉంటాడు. ఎప్పటికప్పుడు అప్ డేటెడ్ గా ఉంటాడు. అలాంటి కార్తీక్ ఆర్యన్ కి నెటిజన్ల నుంచి ఊహించని షాక్ ఎదురైంది. దారుణంగా ట్రోల్స్ చేస్తుండటం గమనార్హం. ఓ పెళ్లికి హాజరైన సమయంలో ఆయన దుస్తులు, రెడీ అయిన విధానం ఏలియన్ లా ఉందంటూ ట్రోల్ చేస్తున్నారు.
ఇంతకీ మ్యాటరేంటంటే ప్యార్ కా పంచ్నామా-ఫేమ్ నటి సొన్నాల్లి సెగల్, తన స్నేహితుడు అశేష్ ఎల్ సజ్నాని వివాహం చేసుకుంది. వీరి వివాహానికి ఆమె సహనటులు కార్తీక్ ఆర్యన్, సన్నీ సింగ్ హాజరయ్యారు. కార్తీక్ పెళ్లికి చాలా సింపుల్ అవుట్ ఫిట్ ని ఎంచుకున్నాడు. చాలా క్యాజువల్ గా వచ్చాడు.
ఆ సమయంలో ఆయన బ్లూ డెనిమ్, బ్రౌన్ స్లిప్పర్స్తో జత చేసిన తెల్లటి కుర్తా ధరించాడు. దానికి తోడు ఒక నలుపు రంగు కళ్లజోడు కూడా పెట్టుకున్నాడు. అదే తేడా కొట్టింది. ఆ డ్రెస్ కి, కళ్ల జోడు సెట్ అవ్వలేదు. దీంతో ఎలియన్ లా ఉన్నావ్ అంటూ నెటిజన్లు కామెంట్ చేయడం గమనార్హం.
అసలు కార్తీక్ ఆర్యన్ లాగానే లేడు అని కొందరు అంటుంటే, కొందు ఎలియన్ అని, మరి కొందరు అక్షయ్ కుమార్ లా పెద్దవాడిలా కనపడుతున్నాడంటూ కామెంట్స్ చేయడం గమనార్హం. ఏదైనా సర్జరీ చేయించుకున్నాడేమో, అందుకే అలా తయారయ్యాడు అని మరి కొందరు కామెంట్ చేయడం విశేషం. మరికొందరేమో కార్తీక్ ఆర్యన్ డోపర్ గ్యాంగర్ లా ఉన్నాడని అంటే అతనిని పోలిన వ్యక్తిలా ఉన్నాడని కామెంట్స్ చేస్తున్నారు.