Boyapati Vs Balayya : ఇంట్రెస్టింగ్.. బాలయ్యతో బోయపాటి పోటీనా!?
Boyapati Vs Balayya : బాలయ్య, బోయపాటి బాక్సాఫీస్ దగ్గర పోటీ పడబోతున్నారా అంటే.. ఔననే అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. బాలయ్య, బోయపాటిది డెడ్లీ కాంబినేషన్. సింహా, లెజెండ్, అఖండ సినిమాలు.. ఒక దాన్ని మించి ఒకటి బాక్సాఫీస్ దగ్గర దుమ్ముదులిపేశాయి.
బాలయ్య, బోయపాటి బాక్సాఫీస్ దగ్గర పోటీ పడబోతున్నారా అంటే.. ఔననే అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. బాలయ్య, బోయపాటిది డెడ్లీ కాంబినేషన్. సింహా, లెజెండ్, అఖండ సినిమాలు.. ఒక దాన్ని మించి ఒకటి బాక్సాఫీస్ దగ్గర దుమ్ముదులిపేశాయి. నెక్స్ట్ అఖండ సీక్వెల్ కూడా రాబోతోంది. కానీ ఇప్పడు ఇద్దరి మధ్య పోటీ తప్పేలా లేదంటున్నారు. ప్రస్తుతం ఎనర్జిటిక్ హీరో రామ్‌తో భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ చేస్తున్నాడు బోయపాటి. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. శ్రీలీల హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమా పై భారీ ఆశలే పెట్టుకున్నాడు రామ్. అఖండ తర్వాత బోయపాటి చేస్తున్న సినిమా కావడంతో.. ఎక్స్పెక్టేషన్స్ భారీగా ఉన్నాయి. తాజాగా ఈ సినిమాను దసరా సందర్భంగా అక్టోబర్ 20న రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. అయితే ఈసారి దసరాకు బాలయ్య కూడా రాబోతున్నాడనే టాక్ నడుస్తోంది. ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఎన్బీకె 108 ప్రాజెక్ట్ చేస్తున్నాడు బాలయ్య. ఇప్పటికే రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ అంచనాలను భారీగా పెంచేశాయి. హీరోయిన్గా కాజల్ అగర్వాల్, బాలయ్య కూతురిగా శ్రీలీల నటిస్తోంది. ఈ సినిమాను దసరాకు రిలీజ్ చేయబోతున్నట్టుగా చాలా రోజులుగా వినిపిస్తోంది. కానీ ఇప్పుడు బోయపాటి, రామ్ సినిమా.. దసరాకు వస్తున్నట్టు అనౌన్స్ చేశారు. ఇప్పటి వరకు దసరా బరిలో మరో సినిమా లేదు. కాబట్టి ఖచ్చితంగా బాలయ్య బరిలో దిగడం పక్కా అంటున్నారు. అదే జరిగితే బాలయ్యతో బోయపాటికి పోటీ తప్పదు. కానీ రామ్, బోయపాటి అంత రిస్క్ చేస్తారా.. అంటే డౌటే. కాదంటే మాత్రం బాలయ్య, బోయపాటి మధ్యన పోటీ ఇంట్రెస్టింగ్గా ఉంటుందని చెప్పిచ్చు. అయితే.. బాలయ్య సినిమా రిలీజ్ డేట్ పై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.