ఉన్ని ముకుందన్ ఈమధ్యనే మలికప్పురం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ.100 కోట్లకు పైనే కలెక్షన్లు రాబట్టింది. 2017లో ఉన్ని ముకుందన్ (Unni Mukundan)పై ఓ మహిళ లైంగిక వేధింపుల కేసు వేసింది.
మలయాళ స్టార్ హీరో ఉన్ని ముకుందన్(Unni Mukundan)కు కేరళ హైకోర్టు షాక్ ఇచ్చింది. లైంగిక వేధింపుల కేసులో తనను నిర్దోషిగా ప్రకటించాలని ఆయన పిటీషన్ వేశారు. అయితే పిటీషన్ ను కోర్టు తిరస్కరించింది. ఫిబ్రవరిలోనే ఈ కేసుపై విధించిన స్టేను తాజాగా హైకోర్టు(High Court) ఎత్తివేస్తూ ప్రకటించింది. వెంటనే ఉన్ని ముకుందన్ ను విచారించాలని కోర్టు ఆదేశించింది.
2017లో ఉన్ని ముకుందన్ (Unni Mukundan)పై ఓ మహిళ లైంగిక వేధింపుల కేసు వేసింది. సినిమా ప్రాజెక్టు గురించి చర్చించేందుకు కొచ్చిలోని ఉన్ని ముకుందన్ ఇంటికి వెళ్తే తాను అసభ్యంగా ప్రవర్తించాడని ఆ మహిళ తెలిపింది. తనను వేధింపులకు గురిచేసినట్లు తన ఫిర్యాదులో తెలిపింది.
సదరు మహిళ ఆరోపణలను హీరో ఉన్ని ముకుందన్(Unni Mukundan) ఖండించాడు. ఆమెపై పరువు నష్టం కేసును కూడా దాఖలు చేశాడు. అయితే సెటిల్ మెంట్ లో ఆమె రూ.25 లక్షలు డిమాండ్ చేసిందని ఆరోపణ చేశాడు. ఇరువర్గాలు సెటిల్మెంట్కు వచ్చాయని తెలుపుతూ హీరో కోర్టులో నకిలీ అఫిడవిట్ దాఖలు చేశాడు. ఈ అఫిడవిట్ ఆధారంగా కేరళ హైకోర్టు ఈ కేసుపై స్టే విధించింది. తాజాగా మే 23న ఈ కేసుపై స్టే ఎత్తివేస్తూ విచారణ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఉన్ని ముకుందన్ ఈమధ్యనే మలికప్పురం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ.100 కోట్లకు పైనే కలెక్షన్లు రాబట్టింది.