స్టార్ హీరో ధనుష్ అభిమానులకు గుడ్ న్యూస్ వచ్చేసింది. ఈ హీరో నటించిన సార్ మూవీ ట్రైలర్ రేపు(ఫిబ్రవరి 8న) రిలీజ్ కానుంది. స్టూడెంట్స్ బ్యాక్‌డ్రాప్‌లో వస్తున్న ఈ చిత్రంలో ధనుష్‌ని స్ట్రిక్ట్ లెక్చరర్‌గా చూపిస్తున్న కొత్త పోస్టర్ ను మేకర్స్ విడుదల చేస్తూ ప్రకటించారు. వెంకీ అట్లూరి రచించి, దర్శకత్వం వహించిన ఈ చిత్రం 90ల నాటి కథాంశంతో తెరకెక్కించనట్లు తెలుస్తోంది. వ్యాపార లాభం కోసం పిల్లలకు విద్యను అందించే ఇన్స్టిట్యూట్లకు వ్యతిరేకంగా ధనుష్ లెక్చరర్‌గా మారినట్లు సమాచారం.
అయితే ఈ సినిమా 2023 ఫిబ్రవరి 17న థియేటర్లలో తెలుగు, తమిళ భాషల్లో విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ చిత్రంలో ధనుష్ సరసన సంయుక్త మీనన్ హీరోయిన్ గా యాక్ట్ చేసింది. జీవీ ప్రకాశ్ కుమార్ మ్యూజిక్ సమకూర్చారు. ఈ చిత్రాన్ని సితార ఎంటర్ టైన్ మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా నిర్మించాయి. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన సాంగ్స్, టీజర్ ప్రేక్షకుల్లో అంచనాలను మరింత పెంచేశాయి.