chiranjeevi : ఉమెన్స్‌డే స్పెషల్.. కూతురికి కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చిన చిరంజీవి
Chiranjeevi మెగాస్టార్ చిరంజీవి ఉమెన్స్‌డే సందర్భంగా ఆయన కుమార్తె సుష్మితకు కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చారు. బంగారం, వెండితో పూత పూసిన దర్గా అమ్మవారి ప్రతిమని ఉమెన్స్ డే సందర్భంగా ఆమెకు అందించారు. ఈ సంగతిని సుస్మిత్ ఇన్‌స్టాగ్రాంలో పోస్ట్ చేశారు. చిరంజీవికి థాంక్స్ చెబుతూ అందుకు సంబంధించిన ఫోటోను కూడా యాడ్ చేశారు.
Chiranjeevi మెగాస్టార్ చిరంజీవి ఉమెన్స్‌డే సందర్భంగా ఆయన కుమార్తె సుష్మితకు కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చారు. బంగారం, వెండితో పూత పూసిన దర్గా అమ్మవారి ప్రతిమని ఉమెన్స్ డే సందర్భంగా ఆమెకు అందించారు. ఈ సంగతిని సుస్మిత్ ఇన్‌స్టాగ్రాంలో పోస్ట్ చేశారు. చిరంజీవికి థాంక్స్ చెబుతూ అందుకు సంబంధించిన ఫోటోను కూడా యాడ్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.
ఇదిలా ఉండగా చిరు రీ ఎంట్రీ తరువాత నుంచి చిరంజీవికి కాస్ట్యూమ్ డిజైనర్ గా తన కూతురు సుష్మిత వ్యవహరిస్తూ వస్తున్నారు. వాల్తేరు వీరయ్య సినిమాలో ముఖ్యంగా చిరు అదిరిపోయే వింటేజ్ లుక్స్ వెనకాల సుష్మిత కాస్ట్యూమ్స్ డిజైనింగ్ ప్రభావమూ ఉంది. బాబీ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో మాస్ మహారాజ్ రవితేజ కూడా నటించారు. ఇక ఈ మూవీలో చిరంజీవి వింటేజ్ లుక్స్, కామెడీతో అదరగొట్టేశాడు. దీంతో ప్రేక్షకులు ఈ సినిమాకు బ్రహ్మరథం పట్టారు. డబుల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. దాదాపు 140 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద 230 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. ఇదిలా ఉండగా మెగాస్టార్ ప్రస్తుతం భోళాశంకర్ సినిమాలో నటిస్తున్నారు. వచ్చే దసరా సీజన్లో రిలీజ్ చేయాలన్న ఉద్దేశంతో షూటింగ్‌ని శరవేగంగా చేసేస్తున్నారు. తమిళ సూపర్ హిట్ సినిమా వేదాళంకి ఇది రీమేక్. మెహర్ రమేష్ దీన్ని డైరెక్ట్ చేస్తున్నారు. మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్. సిస్టర్ సెంటిమెంట్ తో వస్తున్న ఈ సినిమాలో చిరంజీవికి చెల్లిగా కీర్తి సురేష్ నటిస్తున్నారు.