బాలీవుడ్ స్టార్ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్ (Karan Johar) భారీ సినిమాలు నిర్మిస్తూనే వరుస క్రేజీ షోలతో నెట్టింట వైరల్ అవుతున్నారు. `కాఫీ విత్ కరణ్` షోలో సినీ సెలబ్రిటీలను ప్రత్యేకంగా ఇంట్వ్యూలు చేస్తూ ఆయన చేసిన హంగామా అంతా ఇంతా కాదు. కొన్ని సందర్భాల్లో విమర్శలు కూడా ఎదుర్కొన్నారు. తన షోలో పాల్గొన్న హీరోయిన్ల వ్యక్తి గత విషయాలతో పాటు బెడ్రూమ్ విషయాలపై కూడా ప్రశ్నలు సంధిస్తూ వైరల్ అయ్యారు. కరణ్ జోహార్‌కు సోషల్ మీడియా(Social media)లోనూ భారీగా ఫాలోవర్స్ ఉన్న సంగతి తెలిసిందే. అంతే కాకుండా ఎప్పటికప్పుడు ట్వీట్టర్లో అప్డేట్స్ ఇస్తుంటారు. అయితే తాజాగా ట్విటర్‌కు పోటీగా థ్రెడ్స్ యాప్ (Threads app) వచ్చిన సంగతి తెలిసిందే. కరణ్ జోహార్ అందులోకి ఎంట్రీ ఇచ్చారు. థ్రెడ్స్‌లోకి ఎంట్రీ ఇచ్చిన కరణ్.. అభిమానులు తనను ఏదైనా అడగాలంటూ ఛాన్స్ ఇచ్చారు.
పది నిమిషాల పాటు మీ అందరికీ అందుబాటులో ఉంటానని తెలిపాడు. అయితే ఓ నెటిజన్ (Netizen) మాత్రం చాలా ఆశ్చర్యకర ప్రశ్నవేశాడు. మీరు గే కదా? అని మెసేజ్ చేశాడు. అతనికి కూడా అదేరీతిలో దిమ్మదిరిగేలా కౌంటరిచ్చాడు కరణ్. నీకు ఆసక్తిగా ఉందా? అంటూ రిప్లై ఇచ్చాడు. ఇది ప్రస్తుతం తెగ వైరలవుతోంది. కొత్త యాప్‌లో ఎంట్రీ ఇవ్వగానే కరణ్‌కు ఇలాంటి షాకిచ్చాడేంట్రా నెటిజన్స్ చర్చించుకుంటున్నారు. కాగా.. కరణ్ జోహార్ నిర్మిస్తున్న రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ (love story) జూలై 28న థియేటర్లలో సందడి చేయనుంది. బాలీవుడ్ చిత్రనిర్మాత కరణ్ జోహార్ దాదాపుగా అందరికీ సుపరిచితమే. గతేడాది బ్రహ్మస్త్ర (Brahmastra movie) సినిమాను నిర్మించారు. ఆలియా భట్, రణ్‌బీర్ కపూర్, నాగార్జున ఈ చిత్రంలో కీలకపాత్రల్లో కనిపించారు. ప్రస్తుతం ‘రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ’ అనే చిత్రాన్ని నిర్మిస్తున్నారు.