గత రెండు వారాలుగా టమటా ధరలు (Tomato prices) ఆకాశాన్ని తాకుతున్నాయి. దీంతో వాటిని కొనలేని వ్యక్తులు సులభంగా దొంగతనం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో ఓ టమాటో తోటలో పడి దాదాపు 2.50 లక్షల విలువ చేసే టమటాలను ఎత్తుకెళ్లిన వార్త దేశ వ్యాప్తంగా వైరల్ అయింది. దీంతో అప్రమత్తమైన ఓ కూరగాయల వ్యాపారి(Vegetable merchant) .. తన షాప్ ముందు ఉంచిన టమటాలను రక్షించేందుకు ఇద్దరు బౌన్సర్(Bouncer)లను నియమించుకున్నాడు.
ఈ విచిత్ర సంఘటన యూపీ (UP)లోని వారణాసిలో చోటు చేసుకోగా దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీనికి స్పందిస్తున్న నెటిజన్లు.. ఇప్పుడున్న పరిస్థితుల్లో టమటాలకు ఈ రేంజ్ సెక్యూరిటీ (Security) అవసరమె అని కామెంట్ చేయగా.. మరో వ్యక్తి.. మరో ఇద్దరికి పని కల్పించే స్థాయికి టమటా ఎదగడం గర్వంగా ఉందని సెటైరికల్‌గా కామెంట్ చేశారు.’టమాటా ధరలు ఎక్కువగా ఉన్నాయి.. ప్రజలు వాటిని ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు.. దీంతో రక్షణగా ‘బౌన్సర్ల'(Bouncers)ను పెట్టుకున్నా’ అని వ్యాపారి అజయ్ ఫాజీ (Ajay Fazi) తెలిపారు. ప్రస్తుతం కిలో టమాటా రూ. 160 ఉండగా వినియోగదారులు 50 లేదా 100 గ్రాములు