Hero Mavrick 440 : మన దేశంలో దిగ్గజ వాహన తయారీ సంస్థగా ఉన్న హీరో మోటో కార్ప్ ఈ మధ్య మావ్రిక్ 440 అనే పవర్ ఫుల్, స్టైలిష్ బైక్ ని మార్కెట్లోకి విడుదల చేసింది. బేస్, మిడ్, టాప్ వేరియంట్లలో ఇది వినియోగదారులకు అందుబాటులోకి వచ్చింది. ఆసక్తి ఉన్న వారికి ప్రస్తుతం బుకింగ్‌లు కూడా ఇప్పటికే ప్రారంభం అయ్యాయి. దీనికి సంబంధించిన ధరలు, ఫీచర్ల వివరాలు ఇలా ఉన్నాయి.
హీరో మావ్రిక్ 440 ఒక ఫ్లాగ్షిప్ బైక్. ఎక్స్ షోరూంలో దీని బేస్ వేరియంట్ ధర 1.99లక్షలుగా ఉంది. అలాగే మిడ్ వేరియంట్ ధర రూ. 2.14 లక్షలుగా ఉంది. టాప్ వేరియంట్ రూ.2.24 లక్షలుగా ఉంది. ఈ బైక్‌ని బుకింగ్ చేసుకోవాలనుకునే వారు ఎవరైనా సరే షోరూంకి వెళ్లి రూ.ఐదు వేలు టోకెన్ అమౌంట్‌గా కట్టి దీన్ని బుక్ చేసుకోవచ్చు.
ఇప్పుడు బుకింగ్ చేసుకున్న వారికి ఏప్రిల్ నుంచి డెలివరీలు ఇవ్వాలను సంస్థ ప్రణాళిక చేసుకుంటోంది. మార్చి 15లోపు మావ్రిక్ 440ని బుక్ చేసుకునే వారికి రూ. 10వేలు విలువ చేసే కస్టమైజ్డ్ మావ్రిక్ కిట్ యాక్ససరీస్ని ఉచితంగా ఇవ్వనుంది. ఈ విషయంమై హీరో మోటోకార్ప్సీఈమో నిరంజన్ గుప్తా మాట్లాడారు. తమ మావ్రిక్ 440 హార్లీ డేవిడ్సన్ 400ని పోలి ఉంటుందన్నారు. ప్రీమియం బైక్‌ల మార్కెట్ నుంచి దీనికి మంచి స్పందన లభిస్తోందన్నారు. తాము ప్రీమియం బైక్‌ల మార్కెట్లో ఆధిపత్యం కోసం ప్రయత్నిస్తున్నామని అన్నారు. ఈ బైక్ ద్వారా దాన్ని కొనసాగిస్తున్నట్లు ఆనందం వ్యక్తం చేశారు.