New Zealand win the toss and opt to bat first against India
IND vs NZ : భారత్, న్యూజిలాండ్ మధ్య మరికొద్దిసేపట్లో ప్రారంభం కాబోయే రెండో టీ20 మ్యాచ్ లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో టీమిండియా ముందు బౌలింగ్ చేయనుంది. ఈ మ్యాచ్ లక్నోలో జరగనుంది. ఈ మ్యాచ్ లో టీమిండియా నుంచి తుది జట్టులో చోటు దక్కించుకున్న వారిలో హార్థిక్ పాండ్యా(కెప్టెన్), ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), శుభ్ మన్ గిల్, రాహుల్ త్రిపాఠీ, సూర్యకుమార్ యాదవ్(వైస్ కెప్టెన్), దీపక్ హూడా, వాషింగ్టన్ సుందర్, కుల్ దీప్ యాదవ్, శివమ్ మావి, యజ్వేంద్ర చాహల్, అర్ష్ దీప్ సింగ్ ఉన్నారు. న్యూజిలాండ్ టీమ్ నుంచి అలెన్, కాన్వే, చాప్ మాన్, మిచెల్, ఫిలిప్స్, బ్రేస్ వెల్, సాంత్నర్(కెప్టెన్), డప్ఫీ, టిక్ నర్, ఫెర్గుసన్, సోధీ బరిలో ఉన్నారు.