W.G: భీమవరం కలెక్టరేట్లో మంగళవారం నిర్వహించిన ఎన్కార్డ్ జిల్లా స్థాయి సమీక్షలో కలెక్టర్ నాగరాణి మాట్లాడారు. మాదకద్రవ్యాల వల్ల కలిగే అనర్థాలపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. ఎస్పీ అద్నాన్ నయీం అస్మి, జేసీ రాహుల్ కుమార్ రెడ్డి పాల్గొన్న ఈ సమావేశంలో.. మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండేలా కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.