కర్నూలు: న్యాయవాది పవన్ కుమార్‌పై జరిగిన పోలీస్ దాడిని ఖండిస్తూ ఎమ్మిగనూరు న్యాయవాదులు విధులను బహిష్కరించి సోమవారం నిరసన తెలిపారు. స్థానిక కోర్టు నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రషీదుల్లా మాట్లాడుతూ, సంబంధిత సిఐపై వెంటనే సస్పెన్షన్ విధించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.