»Animal Beauties In Prabhas Next Movie Rashmika Mandanna Tripti Dimri
Prabhas: ప్రభాస్ నెక్స్ట్ సినిమాలో అనిమల్ బ్యూటీస్?
ప్రభాస్ అప్ కమింగ్ ఫిల్మ్‌లో అనిమల్ హీరోయిన్ను తీసుకుంటున్నారనే న్యూస్ గత కొద్ది రోజులుగా వినిపిస్తునే ఉంది. ఇక ఇప్పుడు మరో బ్యూటి పేరు కూడా వినిపిస్తోంది. దీంతో అనిమల్‌లో బ్యూటీలో ఎవరికి ప్రభాస్ సరసన ఛాన్స్ దొరుకుంతుందనేది హాట్ టాపిక్‌గా మారింది.
Animal beauties in Prabhas' next movie? Rashmika Mandanna, Tripti Dimri
Prabhas: కల్కి, రాజాసాబ్, సలార్ 2 కంప్లీట్ అవగానే సందీప్ రెడ్డి వంగతో స్పిరిట్‌ను సెట్స్ పైకి తీసుకెళ్లనున్నాడు ప్రభాస్. ఒకవేళ స్పిరిట్ లేట్ అయితే.. అనిమల్ పార్క్ చేయడానికి రెడీ అవుతున్నాడు సందీప్. త్వరలోనే ఈ విషయంలో క్లారిటీ రానుంది. కానీ సందీప్ మాత్రం ఈ ఏడాదిలోనే స్పిరిట్ సెట్స్ పైకి వెళ్లనుందని అనిమల్ ప్రమోషన్స్‌లో భాగంగా చెప్పుకొచ్చాడు. దీంతో స్పిరిట్ గురించి ఏదో ఒక రూమర్ వినిపిస్తునే ఉంది. ముఖ్యంగా స్పిరిట్‌లో హీరోయిన్ ఎవరు? అనే చర్చ జరుగుతోంది. అనిమల్ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్గా నటించగా.. త్రిప్తి డిమ్రి కీ రోల్ ప్లే చేసింది. ఈ ఇద్దరికీ అనిమల్తో నేషనల్ వైడ్‌గా ఫుల్ పాపులారిటీ వచ్చింది. ముఖ్యంగా త్రిప్తి డిమ్రి అందానికి కుర్రకారు ఫిదా అయిపోయారు.
దీంతో.. నెక్స్ట్ స్పిరిట్ సినిమాలోను సందీప్ రెడ్డి వంగ, త్రిప్తికి ఛాన్స్ ఇవ్వనున్నాడనే మాట వినిపిస్తోంది. కానీ ఇప్పుడు మాత్రం రష్మిక కూడా రేసులోకి దూసుకొచ్చిందని అంటున్నారు. అనిమల్‌లో రష్మిక వర్క్ నచ్చడంతో మరొసారి స్పిరిట్‌లో కూడా ఆమెనే హీరోయిన్గా తీసుకోవాలని సందీప్ ఫిక్స్ అయ్యాడట. అయితే ఇలాంటి వార్తల్లో ఎంతవరకు నిజం ఉందనేది తెలియాల్సి ఉంది. అయితే.. సందీప్ రెడ్డి వంగ ‘అనిమల్’ హీరోయిన్లనే స్పిరిట్‌లో రిపీట్ చేస్తాడనే గ్యారెంటీ లేదు. ఒకవేళ ఛాన్స్ ఇస్తే.. అనిమల్‌లో జోయాగా వేడి పుట్టించిన త్రిప్తి డిమ్రికి సెకండ్ హీరోయిన్గా ఛాన్స్ ఇవ్వనున్నాడనే టాక్ ఉంది. కానీ రష్మిక రేసులోకి వచ్చింది కాబట్టి.. ఇద్దరిలో ఎవరు ఫైనల్ ఎవరు అవుతారో చూడాలి. మరి ప్రభాస్ కోసం సందీప్ ఏ హీరోయిన్ని ఫైనల్ చేస్తాడో చూడాలి.