మిళ డైరెక్టర్ అట్లీ గురించి స్పెషల్ గా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తమిళంలో సూపర్ హిట్ సినిమాలకు దర్శకత్వం వహించి స్టార్ డైరెక్టర్‌గా నిలిచారు. అయితే అట్లీ డ్రీమ్ ప్రాజెక్ట్ విజయ్ అని తెలిపాడు. మరి ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కుతుందా? లేకపోతే ఆగిపోతుందా? తెలుసుకుందాం.
Atlee: తమిళ డైరెక్టర్ అట్లీ గురించి స్పెషల్ గా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తమిళంలో సూపర్ హిట్ సినిమాలకు దర్శకత్వం వహించి స్టార్ డైరెక్టర్‌గా నిలిచారు. ముఖ్యంగా విజయ్‌కి కమర్షియాల్ హిట్లు ఇవ్వడంలో అట్లీ సక్సెస్ అయ్యాడు. జవాన్ (2023)తో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు. సెప్టెంబరు 2023లో విడుదలైంది. షారుఖ్ ఖాన్-నటించిన ఈ చిత్రం సినీ ప్రేక్షకుల నుండి మంచి సమీక్షలను అందుకుంది. 1000 కోట్ల INR వసూళ్లను సాధించి భారీ వాణిజ్య విజయంగా నిలిచింది.
ఈ మూవీ నేపథ్యంలో.. అట్లీ.. తన డ్రీమ్ ప్రాజెక్ట్ గురించి బయటపెట్టాడు. అట్లీ తన తదుపరి వెంచర్, SRK, ‘తలపతి’ విజయ్ నటించిన మల్టీ-స్టారర్ చిత్రం గురించి తన ఉత్సాహాన్ని పంచుకున్నారు. దీనిని ‘డ్రీమ్ ప్రాజెక్ట్’గా పేర్కొంటూ, ప్రపంచవ్యాప్తంగా 3000 కోట్ల రూపాయలను వసూలు చేసే అవకాశం ఉందని, దీనికి వాణిజ్య నిపుణుల నుంచి మిశ్రమ స్పందన లభించిందని అన్నారు. అయితే.. ఈ డ్రీమ్ ప్రాజెక్ట్ తెరకెక్కే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఎందుకంటే.. తలపతి విజయ్ సినిమాలకు గుడ్ బై చెబుతున్నాడు. చివరగా ఆయన వెంకట్ ప్రభు తో సినిమా చేయనున్నాడు. ఈ విషయాన్ని విజయ్ స్వయంగా వెల్లడించాడు.
అదే తన చివరి ప్రాజెక్ట్ అని కూడా విజయ్ చెప్పాడు. ఈ క్రమంలో.. అట్లీ డ్రీమ్ ప్రాజెక్ట్ పట్టాలెక్కే అవకాశం లేనేలేదని తెలుస్తోంది. మరోవైపు, SRK అతిధి పాత్రలు లేదా మల్టీ-స్టారర్లు చేయడం పట్ల తీవ్ర అనాసక్తిని కనబరుస్తున్నారు. అతను ఇటీవల రజనీకాంత్-లోకేష్ కనగరాజ్ చిత్రంలో అతిథి పాత్ర కోసం పెద్దగా ఆసక్తి చూపించలేదు. అట్లీ ‘డ్రీమ్ ప్రాజెక్ట్’ అకలగా మాత్రమే మిగిలిపోయే అవకాశం ఉందని ఇవన్నీ తేల్చాయి. ఇక అట్లీ త్వరలోనే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో ఓ సినిమా చేయనున్నారు. మరి.. ఆ సినిమా ఏ స్టోరీతో వస్తుందో చూడాలి.