ఆంధ్రప్రదేశ్లో ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్కి సంబంధించిన దరఖాస్తుల ప్రక్రియ గురువారం ప్రారంభం అయ్యింది. దీనికి సంబంధించిన ముఖ్యమైన తేదీల వివరాలు ఏమిటంటే...
ఆంధ్రప్రదేశ్లో ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ 2024కి సంబంధించిన దరఖాస్తుల ప్రక్రియ ఇవాళ ప్రారంభం అయ్యింది. అర్హులైన అభ్యర్థులు నేటి నుంచి ఫిబ్రవరి 18వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఈ టెట్ (AP TET) ప్రకటనను బుధవారం విడుదల చేసిన సంగతి అందరికీ తెలిసిందే. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను ఇక్కడున్న లింకు ద్వారా తెలుసుకోవచ్చు. https://aptet.apcfss.in/
ఫిబ్రవరి 18 వరకు దరఖాస్తులు చేసుకున్న వారికి ఫిబ్రవరి 19 నుంచి ఆన్లైన్లో మాక్ టెస్ట్ రాసేందుకు అవకాశం ఉంటుంది. ఆ తర్వాత ఫిబ్రవరి 23వ తారీఖు నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకునేందుకు వీలు కల్పిస్తున్నారు. అలా అభ్యర్థులంతా హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకుని పరీక్షలకు హాజరు కావాల్సి ఉంటుంది. ఫిబ్రవరి 27వ తేదీ నుంచి మార్చి 9వ తేదీ మధ్యలో పరీక్షలు జరగనున్నాయి. డీఎస్సీలో టెట్ మార్కులకు 20 శాతం వెయిటేజీ ఉంటుంది. టెట్, డీఎస్సీ పరీక్షలు రెండూ కూడా కంప్యూటర్ ఆధారంగా నిర్వహించనున్నారు.
ఏపీ టెట్ 2024కి సంబంధించిన ముఖ్యమైన తేదీల వివరాలు ఇలా ఉన్నాయి.
* ఫిబ్రవరి 7, 2024 : ఏపీ టెట్ నోటిఫికేషన్
* ఫిబ్రవరి 8,2024 : దరఖాస్తులు ప్రారంభం
* ఫిబ్రవరి 18, 2024 : దరఖాస్తుల స్వీకరణ తుది గడువు
* ఫిబ్రవరి 23, 2024 : హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు.
* ఫిబ్రవరి 27 నుంచి మార్చి 9 : రెండు సెషన్లలో టెట్ పరీక్షలు
* మార్చి 10, 2024 : టెట్ ప్రాథమిక కీ విడుదల
* మార్చి 11, 2024 : కీ పై అభ్యంతరాల స్వీకరణ
* మార్చి 13, 2024 : టెట్ తుది విడుదల
* మార్చి 14, 2024 : టెట్ తుది ఫలితాలు విడుదల