»Rashmika Mandanna Is Highly Disappointed With Filmfare
Rashmika Mandanna: పాపం రష్మిక.. ఫలితం దక్కలేదే..!
నేషనల్ క్రష్ రష్మిక గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే రష్మిక నటించిన యానిమల్ మూవీ ఎంత హిట్ సాధించిందో తెలిసిందే. ఈ సినిమాలో హీరోగా నటించిన రణబీర్ కపూర్‌కు ఉత్తమ నటుడు అవార్డు లభించింది. మరి రష్మిక కూడా ఈ చిత్రంలో బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది. కానీ తనకి అవార్డు రాలేదు.
Rashmika Mandanna: భారతదేశంలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన అవార్డులలో ఫిల్మ్‌ఫేర్ ఒకటి. అయితే ఈ అవార్డులకి ప్రతి సంవత్సరం మాదిరిగానే మిశ్రమ స్పందనలు వచ్చాయి. ఉత్తమ నటుడి అవార్డు రణబీర్ కపూర్‌కు బదులుగా బాలీవుడ్ కింగ్ గెలవడానికి అర్హుడని షారుక్ ఖాన్ అభిమానులు భావించారు. అంతేకాదు.. చాలా మంది తమ అభిమాన నటీనటులకు రాలేదని సోషల్ మీడియాలో విమర్శలు గుప్పించారు. ఈ అవార్డు రానందుకు అభిమానులు మాత్రమే కాదు.. పలువురు నటులు కూడా బాధపడ్డారట. అలా నిరుత్సాహపడిన వారిలో రష్మిక మందన కూడా ఉండటం విశేషం.
యానిమల్‌లో రణబీర్ సహనటి రష్మిక మందన్న తన కెరీర్లో అత్యుత్తమ నటనను ప్రదర్శించింది. నిస్సందేహంగా ఈ చిత్రంలో రణబీర్ కపూర్, బాబీ డియోల్ తర్వాత ఆమె అందరి ప్రశంసలను పొందింది. పాత్ర చాలా సవాలుగా ఉంది. ఎమోషనల్ సీన్స్ లోనూ ఇరగదీసి అందరినీ ఆకట్టుకుంది. మరోవైపు రాకీ ఔర్ రాణి కి కహానీకి ఉత్తమ నటి అవార్డును గెలుచుకున్న ఆలియా భట్ సవాలు చేసే పాత్ర కానందున, గొప్ప నటనకు స్కోప్ లేనందున ఆమె అర్హత లేనిదని చాలామంది భావించారు. నార్మల్ ఫ్యామిలీ ఎంటర్ ట్రైనర్ మూవీలో నటనకు ఆలియాకు అవార్డు ఇవ్వడం.. సవాలు ఉన్న పాత్ర చేసినా కూడా.. రష్మిక కనీసం అవార్డుకు నామినేట్ కాకపోవడం అందరినీ షాకింగ్ కి గురి చేసింది.
పాపం రష్మిక సైతం తనకు అవార్డు వస్తుందని ఆశించిందట. అందులోనూ కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చినప్పుడు ఆ మాత్రం హోప్స్ ఉంటాయి. కానీ అంత కష్టపడినా కూడా గుర్తింపు రాకపోవడం నిరాశ కలిగించడం సహజం. ఈ విషయంలో రష్మిక కూడా బాగా ఫీలౌతుందట.